కృష్ణా డెల్టాలో సాగునీటి విడుదలకు ప్రణాళిక సిద్ధమైంది. కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 13 లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేసింది. మొత్తం అవసరాల్లో 3.2 టీఎంసీల భూగర్భజలాలు వినియోగించే అవకాశం ఉంది. ఇప్పటికే పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేశారు. బ్యారేజీ నుంచి ఏలూరు, బందరు కాలువలు, గుంటూరు ఛానల్‌కు నీటిని విడుదల చేశారు.
ఇదీ చదవండి: పీవీకి 'వంద'నం: సంస్కరణల సారథి.. అభివృద్ధికి వారధి