ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక... ఓటేసినందుకు గుర్తుగా ఎడమ చేతి చూపుడు వేలికి అంటించే సిరా చుక్క మన బాధ్యతను గుర్తుచేస్తుంది. ఓటర్లు ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటేయకుండా గుర్తించే వీలుంది. 2006 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కిందకు గీత గీస్తున్నారు. అంతకుముందు గోరు కింద ఉండే చర్మంపైనా గుర్తుపెట్టేవారు.
సిరా చుక్క ఎక్కువ రోజులు చెరిగిపోకుండా ఉండేందుకు కారణం సిల్వర్ నైట్రేట్ అనే రసాయనం. ఈ ఇంకు తయారీకీ సిల్వర్ నైట్రేట్‌ను 10-18 శాతం వరకు వాడుతారు. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్ణిష్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని రాయుడు ల్యాబోరేటరీస్‌లో మాత్రమే తయారు చేస్తారు. భారత ఎన్నికల సంఘం మైసూర్ సిరాను ఎక్కువగా ఉపయోగిస్తుంది. చాలా దేశాలు రాయుడు ల్యాబరేటరీస్ సిరాను ఉపయోగిస్తున్నాయి.
1937లో కంపెనీ స్థాపన
కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీ ఎప్పటి నుంచో ఉంది. ఈ సంస్థను మైసూర్ మహారాజు కృష్ణరాజు వడియార్ 1937లోనే స్థాపించారు. అప్పుడు దీని పేరు మైసూర్ లాక్ అండ్ పెయింట్ వర్స్క్.. ప్రారంభంలో పెయింట్స్ అనుబంధ ఇతర ఉత్పత్తులను సంస్థ తయారుచేసేది. స్వాతంత్య్రం అనంతరం ప్రభుత్వరంగ సంస్థగా మారింది. కర్ణాటక ప్రభుత్వ అధీనంలోనే ఉంది. 1962లో ఎన్నికల సిరా కోసం భారత ఎన్నికల సంఘం ఈ కంపెనీని ఎంపిక చేసింది.
ఇదీ చదవండి: