ETV Bharat / city

చింతామణి నాటక నిషేధంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ - హైకోర్టు తాజా వార్తలు

HIGH COURT: చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును రఘురామకృష్ణరాజు తరఫున ప్రముఖ న్యాయవాది ఉమేష్ అభ్యర్థించారు. అయితే న్యాయవాది వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు.. స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

high court
high court
author img

By

Published : Jun 24, 2022, 4:09 PM IST

HIGH COURT: చింతామణి నాటకం నిషేధంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది ఉమేష్ అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి అంగీకరించలేదు. నాటకానికి సంబంధించిన అసలు, అనువాద పుస్తకాలు సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది.

చింతామణి నాటకాన్ని నిషేధించడాన్ని సవాల్​ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది ఉమేష్ వాదనలు వినిపిస్తూ.. చింతామణి నాటకాన్ని నిషేధించడం అంటే.. వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమే అవుతుందన్నారు. నాటకాన్ని నిషేధించిన కారణంగా పలువురు జీవన ఉపాధి కోల్పోయారని.. దేవదాసి చట్టానికి వ్యతిరేకంగా ఈ నాటకం వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చింతామణి నాటకాన్ని నిషేధించాల్సిన అవసరం లేదని వేడుకున్నారు. నాటకాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.