ETV Bharat / city

'సాంకేతిక సదుపాయాలతో.. సిటీ కోర్టు కాంప్లెక్స్ భవనం నిర్మాణం' - సిటీ కోర్టు కాంప్లెక్స్‌ భవన నిర్మాణ పనులు

విజయవాడలో కొత్తగా నిర్మిస్తున్న సిటీ కోర్టు కాంప్లెక్స్‌ భవనాన్ని.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జోయ్‌ మాల్యా బాగ్చీ పరిశీలించారు. నూతన భవనంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండేలా నిర్మాణం చేపట్టాలని ఇంజినీర్లకు సూచించారు.

construction of City Court Complex building
సిటీ కోర్టు కాంప్లెక్స్‌ భవన నిర్మాణ పనులు
author img

By

Published : Aug 8, 2021, 6:32 PM IST

విజయవాడలో నూతనంగా నిర్మిస్తున్న సిటీ కోర్టు కాంప్లెక్స్‌ భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జోయ్‌ మాల్యా బాగ్చీ పరిశీలించారు. పనులు ఏ దశలో ఉన్నాయంటూ.. న్యాయమూర్తి పరిశీలన చేశారు. నిర్మాణానికి సంబంధించిన వివరాలను న్యాయాధికారులు, భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, ఇంజినీర్లతో మాట్లాడి తెలుసుకున్నారు.

కొవిడ్‌ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరుగుతుందని.. ఈ క్రమంలో విచారణ ప్రత్యక్షంగానే కాకుండా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా నిర్వహించేందుకు అనువైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఇంజనీర్లకు సూచించారు. మొత్తం జీ ప్లస్ ఎనిమిది ఫ్లోర్లుగా భవన నిర్మాణం జరగనుంది.

ఇదీ చదవండి:

TTD CHAIRMAN: తితిదే ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.