గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏలపై యూనిట్ టారిఫ్ ధరలను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ 2019లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ... సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు గతంలో ధర్మాసమం ముందు పిటిషన్ దాఖలు చేశాయి. తాజాగా ఆ పిటిషన్లు మరోసారి విచారణకు వచ్చాయి. విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరఫున సీనియర్ న్యాయవాదులు సంజయ్ సేన్, సజన్ పూవయ్య, ప్రభుపాటిల్, పీ. శ్రీరఘురామ్ తదితరులు వాదనలు వినిపించారు. తాత్కాలిక చర్యల్లో భాగంగా పవన విద్యుత్ యూనిట్‌కు రూ.2.43పైసలు, సౌర విద్యుత్‌కు రూ.2.44 పైసలు చొప్పున చెల్లించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులకు డిస్కంలు కట్టుబడలేదన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
ఎజీ ఎస్.శ్రీరామ్ బదులిస్తూ... బాకాయిలు చెల్లించాల్సిన మాట వాస్తమేనని... సింగిల్ జడ్జి ఉత్తర్వులు ప్రకారం రూ.1,381 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కోర్టుకు వివరించారు. తీసుకుంటున్న చర్యలపై వివరాలను ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శితో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కోరారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం... బకాయిలుకు సంబంధించిన పూర్తివివరాలతో ఏప్రిల్ 1 లోపు అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి