మిడ్ లెవల్ హెల్త్ వర్కర్ పోస్టుల భర్తీ వ్యవహారంలో సర్టిఫికేట్ ప్రోగ్రాం ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీ హెచ్) పూర్తి చేయని బీఎస్సీ (నర్సింగ్) అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పోస్టులకు ఎంత మంది ధరఖాస్తు చేసుకున్నారో..., అందులో సీపీసీహెచ్ లేని వారు ఎందరు తదితర వివరాల్ని తమ ముందు ఉంచాలని స్పష్టంచేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు నాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా , జస్టిస్ కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
బీఎస్సీ (నర్సింగ్) కోర్సులో సీపీసీహెచ్ ధ్రువపత్రం ఉన్నవారు మాత్రమే మిడ్ లెవల్ హెల్త్ వర్కర్ పోస్టులకు అర్హులని పేర్కొంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ ప్రకటనను సవాలు చేస్తూ ఏపీ నర్సింగ్ సంక్షేమసంఘం హైకోర్టులో అత్యవసరంగా ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. న్యాయవాది గుడిపాటి శ్రీహర్ష వాదనలు వినిపిస్తూ .. గతంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం పరీక్ష నిర్వహించి సీపీసీహెచ్ ఇచ్చేదన్నారు. 2020 లో సీపీసీహెచ్ కోర్టును బీఎస్సీ నర్సింగ్ సిలబస్ చేశారని పేర్కొన్నారు. అందులో ఉత్తీర్ణులైన వారినే హెల్త్ వర్కర్ పోస్టులకు అర్హులుగా పేర్కొన్నారని తెలిపారు. దీంతో 2020 కి పూర్వం బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు అనర్హులవుతున్నారుని వివరించారు. దరఖాస్తుల సమర్పణకు ఈనెల 6 చివరి తేదీ గా ఇచ్చిన నేపథ్యంలో సీపీసీహెచ్ లేనివారు దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: