2019-20 విద్యాసంవత్సరానికి రెండో ఏడాది ఇంజినీరింగ్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపునకు సంబంధించిన వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. 2019-20 విద్యాసంవత్సరం రెండో ఏడాది ఇంజినీరింగ్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ 'రాజధాని వార్తలు' ఎడిటర్ పఠాన్ హుస్సేన్ ఖాన్ హైకోర్టులో పిల్ వేశారు. ఆయన పిల్ దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది . ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని విద్యార్థుల ప్రయోజనాలకు పిల్ దాఖలు చేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇవీ చదవండి