ETV Bharat / city

HC: 'గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను చేతితో దిద్దించండి' - High Court directs APPSC

గ్రూప్ -1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల్ని చేతితో దించాలని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టంచేసింది. ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యలకు పిలవాలని, ఎంపిక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పేర్కొంది.

High Court
High Court
author img

By

Published : Oct 2, 2021, 2:48 AM IST

గ్రూప్ -1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల్ని చేతితో దించాలని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టంచేసింది. ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యలకు పిలవాలని, ఎంపిక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పేర్కొంది . ఏపీ పీఎస్సీ కార్యదర్శి, ఏడుగురు సభ్యులు మాత్రమే డిజిటల్ మూల్యాంకన నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించింది. 2020 అక్టోబర్ 28 నాటి సమావేశ అజెండా ఆ నిర్ణయం గురించి స్పష్టమవుతోందని గుర్తుచేసింది. అలాంటి నిర్ణయం తీసుకోవడానికి చట్టం అనుమతించదని తేల్చిచెప్పింది. ఆ తరహా నిర్ణయం రాజ్యాంగం, చట్ట నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.
ప్రస్తుత నోటిఫికేషన్​లో జవాబుపత్రాల్ని మూల్యాంకన విధానాన్ని మార్చడం సరికాదంది. నిబంధనలను సవరిస్తూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ విధులు, అధికారాలను తీసేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. 2020 లో నిబంధనలను చట్టబద్ధంగా సవరించినట్లు రుజువుచేసేందుకు కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఏ కారణం చేతైన ఏపీపీఎస్సీకి ఛైర్మన్ సహకరించకపోతే రాజ్యాంగం ప్రకారం .. తాత్కాలిక ఛైర్మన్​ను నియమించమని గవర్నర్‌ను విజ్ఞప్తి చేస్తే విధానం ఉందని గుర్తుచేసింది. ఏపీపీఎస్సీ మచ్చ లేకుండా స్వచ్ఛంగా ఉండాలని సూచించింది. జవాబు పత్రాలను డిజిటల్ విధానంలో మూల్యాంకనానికి మార్పు చేయడం సరైంది కాదని తేల్చిచెప్పింది. అభ్యర్థులు రాసిన దాన్ని డిజిటల్ విధానంలో స్కాన్ చేశారు తప్ప .. మూల్యాంకనం చేయలేదని ఏపీపీఎస్సీ చెబుతున్న వాదనకు ఆధారాలు లేవంది.

మరోవైపు నోటిఫికేషన్ లో పేర్కొన్న క్లాజ్ 1.10 , 17 ప్రకారం అభ్యర్థులందరికి మూల్యాకన విధానంలో మార్పు చేసినట్లు ఏపీపీఎస్సీ తెలియజేయలేదని ఆక్షేపించింది. ఆశావహుల భవిష్యత్తు, జీవితాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో జవాబుపత్రాల్ని సాంప్రదాయబద్ధంగా చేతితో మూల్యాంకనం చేయించాలని ఆదేశిస్తున్నట్లు తెలిపింది. ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేసి ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచి తదుపరి ఎంపికలను త్వరగా పూర్తి చేయాలనిఏపీపీఎస్సీని ఆదేశించింది.

యువ ఆశావహులైన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగం కోసం చెమటోడ్చి కష్టపడి ఉన్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవహారంలో భాగస్వాములైనవారందరు, అధికారులు నిర్ణయం తీసుకోవాలని.. గొప్ప శక్తితో గొప్ప బాధ్యత వస్తుందని తెలిపింది. పబ్లిక్ అథార్టీ అధికారులు కేవలం ప్రజా శ్రేయస్సు కోసం అధికారాలు వినియోగిస్తారని ఆశిస్తున్నాం అని పేర్కొంది.

భవిష్యత్తులో నిర్వహించబోయే పరీక్షల విషయంలో ఏపీపీఎస్సీ డిజిటల్ మూల్యాంకన విధానాన్ని అనుసరించడానికి ప్రస్తుతం ఇచ్చిన తీర్పు అడ్డంకి కాదని , అయితే మూల్యాంకనంలో కొత్త పద్ధతిని అనుసరించేందుకు తీసుకున్న నిర్ణయం చట్ట నిబంధనల అనుగుణంగా ఉండాలని తేల్చిచెప్పింది . గ్రూప్ 1 పై దాఖలైన పిటిషన్లను పాక్షికంగా అనుమతించింది. గ్రూప్ 1 అక్రమాలపై సీబీఐ తో దర్యాప్తు చేయించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీపీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

తీర్పును పరిశీలించి సోమవారం స్పందిస్తా: ఏపీపీఎస్సీ కార్యదర్శి

హైకోర్టు తీర్పు దస్త్రాన్ని పరిశీలించిన అనంతరం సోమవారం స్పందిస్తానని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి. సీతారామంజనేయులు తెలిపారు.

ఇదీ చదవండి:
పవన్‌ కల్యాణ్‌ పర్యటనపై ఉత్కంఠ..శ్రమదానానికి అనుమతి నిరాకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.