NODAL OFFICERS: మూగజీవాల అక్రమ రవాణా, వధను నిలువరించేందుకు చట్ట నిబంధనలను పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అక్రమ రవాణాపై ఫిర్యాదులు అందుకునేందుకు నోడల్ అధికారులను నియమించాలని పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు సూచించింది. నోడల్ అధికారుల వివరాలు, ఫోన్‌నంబర్లు, మూగజీవాల సంక్షేమ బోర్డు ఇచ్చిన మార్గదర్శకాలను సమాచార, ప్రసారశాఖ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలంది. పత్రికల్లో ప్రచురించాలంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. బక్రీద్ సందర్భంగా మూగజీవాల అక్రమ రవాణా, విచక్షణారహిత వధను నిలువరించాలని యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కార్యదర్శి ఎస్.గోపాలరావు, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. చట్ట నిబంధనలు, జంతు సంక్షేమ బోర్డు మార్గదర్శకాలు అమలయ్యేలా పోలీసులకు తగిన ఆదేశాలివ్వాలని వారు కోరారు.
ఇవీ చదవండి: