ETV Bharat / city

సొంతూళ్లకు పయనం... రద్దీగా పండిట్ నెహ్రూ బస్​స్టేషన్

సంక్రాంతికి జనాలు సొంతూళ్ల బాట పట్టడంతో పండిట్ నెహ్రూ బస్​స్టేషన్ రద్దీగా మారింది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది.

pandit Nehru bus station
సొంతూళ్ల బాటలో జనాలు.. రద్దీగా మారిన పండిట్ నెహ్రూ బస్​స్టేషన్
author img

By

Published : Jan 12, 2021, 3:14 AM IST

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తోన్న వారితో ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి పెద్దఎత్తున ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఫలితంగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టేషన్​లో రద్దీ నెలకొంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

కొవిడ్ నిబంధనల మేరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాయలసీమ సహా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రతి ప్రయాణుకుడికీ బస్సు సదుపాయం కల్పించేలా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు.

ఇదీ చూడండి: కేంద్రమంత్రులను కలిసిన ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.