ETV Bharat / state

సెకి దస్త్రం పరుగులు - 7 గంటల్లోనే ఆమోదం - ADANI BRIBE TO YS JAGAN

ఒక్క రోజులో సెకి ఒప్పందంపై ముందుకెళ్లిన జగన్‌ ప్రభుత్వం

Adani Bribe to YS Jagan
Adani Bribe to YS Jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2024, 9:39 AM IST

Adani Bribe to YS Jagan : ఒక దస్త్రం ఆర్థికశాఖలో కార్యదర్శి నుంచి కిందిస్థాయి వరకు నాలుగైదు దశల్లో వడపోత తర్వాత ఆమోదం ముద్ర పడుతుంది ఈ దశల్లో ఎదైనా కొర్రీ వేస్తే మళ్లీ సంబంధిత శాఖకు వచ్చి వెళ్లాల్సిందే. కానీ సెకి దస్త్రానికి మాత్రం మినహాయింపు. అధికారులు ఆమోదముద్ర వేసి పంపడానికి పట్టిన సమయం 7 గంటలు. అదీ అర్ధరాత్రి. రూ.1.10 లక్షల కోట్ల విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించిన దస్త్రాన్ని ఆర్థికశాఖ ఆఘమేఘాల మీద ఆమోదం తెలిపింది. దీనివెనుక సర్కార్​ పెద్దలు ఎంతగా ఒత్తిడి చేయకుంటే దస్త్రం ఇంతలా పరుగులు పెడుతుంది?

  • అది 2021 సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్ర 5:30 గంటలు. మిగిలిన కార్యాలయాన్నీ మూతపడ్డాయి. ఆర్థికశాఖ, ఇంధనశాఖ, ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఈసీఎల్‌) సిబ్బంది మాత్రం పనిచేస్తూనే ఉన్నారు. కారణం మర్నాడు జరిగే కేబినెట్ సమావేశానికి సెకి దస్త్రం పంపాలని సర్కార్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ ఒప్పందంతో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరకపోగా 25 సంవత్సరాల్లో ప్రజలపై రూ.1.10 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని నిపుణుల అంచనా. సెకి ఒప్పందం ద్వారా జగన్‌కు లంచాలు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. దీంతో ఆ ఒప్పందం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దస్త్రం సిద్ధం చేయడంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం

రాత్రికి రాత్రే - దస్త్రం తయారు : జగన్‌ సర్కార్ 10 గిగావాట్ల సోలార్‌ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు టెండర్లు పిలిచింది. అయితే ప్రాజెక్టుల ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉందని దానికి ప్రత్యామ్నాయంగా సెకి నుంచి విద్యుత్‌ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అది తీసుకోడానికి ముందు ఎంత కసరత్తు జరగాలి? కరెంట్ తీసుకుంటే రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి? అంత విద్యుత్‌ వినియోగించగలమా? ప్రజలపై ఎలాంటి ఆర్థికభారం పడుతుంది? ఇలాంటి లెక్కలు వేయాలి. ఎంత లేదన్నా కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది.

కానీ జగన్‌ సర్కార్​కి మాత్రం గంటల వ్యవధి చాలట! సెకి నుంచి ప్రతిపాదన అందిన మర్నాడే మంత్రిమండలి సమావేశం పెట్టి ఆమోదం తెలిపింది. 7000ల మెగావాట్లు కొనేందుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. లాభనష్టాలను అంచనా వేయకుండా అంత గుడ్డిగా ముందుకు వెళ్లిందంటే ప్రజా ప్రయోజనాలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.

2021 సెప్టెంబర్ 15న రాష్ట్రప్రభుత్వానికి సెకి తొలిసారిగా ప్రతిపాదన అందించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద 9 గిగావాట్ల సౌరవిద్యుత్ కొనాలని ప్రతిపాదించింది. సెకి నుంచి ప్రతిపాదన రాగానే దస్త్రం తయారీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నుంచి ఆదేశాలు అందాయి.

ఈ ప్రతిపాదనపై అధికారులు చేసిన సూచనలు :

  • రాష్ట్ర గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ టెండర్ల ద్వారా యూనిట్‌ రూ.2.49 చొప్పున విద్యుత్‌ సరఫరాకు బిడ్‌లు వచ్చాయి. ఆ ధరకు విద్యుత్ ఇస్తామని సెకి చెప్పింది.
  • ఈ ప్రాజెక్టుకు 25 సంవత్సరాలు అంతర్రాష్ట్ర పంపిణీ రుసుమును కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసింది.
  • 10 గిగావాట్లు కాకుండా అవసరం మేరకే కొనుగోలు పరిమితం చేయాలి.

ఒక్కరోజు ఏం జరిగిందంటే! :

  • సెకి ప్రతిపాదనను 2021 సెప్టెంబర్ 15న కేబినెట్ ముందు ఉంచాలని సీఎస్‌ నుంచి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంధనశాఖ అదే రోజు సాయంత్రం 3 గంటలకు దస్త్రం తయారుచేసింది. ఆ ఫైల్‌ను సూచనల కోసం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌కి పంపింది. సాయంత్రం 5 గంటలకు ఆయన ఆమోదం తెలిపారు. అనంతరం దస్త్రాన్ని ఆర్థికశాఖకు ఇంధనశాఖ అధికారులు పంపారు. ఆర్థికశాఖ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆమోదించింది.
  • 2021 సెప్టెంబర్ 16న ఉదయం 7 గంటల సమయంలో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ ఈ-ఫైల్‌ను సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు పంపారు. ఆయన ఉదయం 7:45 గంటలకు ఆమోదం తెలిపారు. దానిని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సమర్పించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో మంత్రి బాలినేని దాన్ని ఆమోదించారు.
  • తర్వాత మంత్రిమండలిలో ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రి పరిశీలనకు అధికారులు పంపారు. ఒప్పందం ప్రతిపాదనను మంత్రివర్గం ముందు ఉంచాలని సీఎం ఉదయం 8:10 గంటల సమయంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్‌ కొనుగోలు ప్రతిపాదన వివరాలను కేబినెట్ ఆమోదం కోసం ప్రభుత్వం ఉంచింది.
  • 2021 సెప్టెంబర్ 16న ఏపీజీ ఈసీఎల్‌ చెప్పినట్లు యూనిట్‌ రూ.2.49 ధరకు 30 సంవత్సరాల పాటు సెకి నుంచి సౌరవిద్యుత్‌ తీసుకోవాలన్న ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది.

జగన్‌ పాత్ర నిజమే అయితే క్షమించరానిది - మంత్రిగా చేసినందుకు బాధపడుతున్నా: బాలినేని

జగన్​ అంటే లోకల్​ అనుకుంటివా? ఇంటర్నేషనల్​! - అవినీతిలో తగ్గేదేలే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.