ETV Bharat / offbeat

కరివేపాకు ఒక్కటి చాలు! - అద్దిరిపోయే పులుసు మీ ముందు! - CURRY LEAVES PULUSU

టేస్టీ అండ్​ హెల్దీ కరివేపాకు పులుసు - వారం రోజులైనా తాజాగా ఉంటుంది

Curry Leaves Pulusu
How to Make Curry Leaves Pulusu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2025, 11:40 AM IST

How to Make Curry Leaves Pulusu : దాదాపు మనం వండే ప్రతి కూరలోనూ కరివేపాకు తప్పకుండా వేస్తాం. ఏ కర్రీలోనైనా రెండు రెమ్మల కరివేపాకు వేస్తేనే రుచి ఇంకాస్త బాగుంటుంది! అయితే, మనలో చాలా మంది కరివేపాకు ఆరోగ్యానికి మంచిదని తెలిసినా అన్నం తినేటప్పుడు వస్తే మాత్రం తీసి పక్కన పెట్టేస్తారు. దీనివల్ల మన ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతున్నట్లే లెక్క! అయితే, ఇలా కరివేపాకు తినని వారి కోసం అద్దిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. అదే కమ్మటి కరివేపాకు పులుసు. ఈ పులుసు ఆరోగ్యానికి చాలా మంచిది. వేడివేడి అన్నం ఈ పులుసుతో తింటే రుచి అద్దిరిపోతుంది. పైగా దీనిని ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్​లో పెట్టుకుని వారం రోజుల పాటు తినచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్​ హెల్దీ కరివేపాకు పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • కరివేపాకులు - 100 గ్రాములు
  • దంచిన వెల్లుల్లి రెబ్బలు - 20
  • నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • టమాటా - 1
  • ఉల్లిపాయ - 1
  • చింతపండు - నిమ్మకాయ సైజంతా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు టీస్పూన్
  • కారం - సరిపడా
  • ధనియాల పొడి - 2 టీస్పూన్లు
  • నీళ్లు - సరిపడా
  • ఆవాలు - టీ స్పూన్​
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • ఎండుమిర్చి - 4
  • ఇంగువ - చిటికెడు
  • బెల్లం తురుము - 2 టేబుల్​స్పూన్లు

తయారీ విధానం :

  • ముందుగా చింతపండు నీటిలో 10 నిమిషాలు నానబెట్టి చిక్కటి చింతపండు రసం సిద్ధం చేసుకోవాలి.
  • అలాగే వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి పక్కన ఉంచాలి. వాటిని కచ్చాపచ్చాగా దంచుకోండి. అలాగే టమాటా, ఉల్లిపాయ సన్నగా కట్​ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
  • కరివేపాకులను ఒలిచి ఒక గిన్నెలోకి తీసుకోండి.
  • ఇప్పుడు స్టవ్​పై పాన్​​ పెట్టి ఆయిల్​ వేయండి. వేడివేడి నూనెలో వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయండి. ఆపై కరివేపాకులు వేసి కాసేపు వేపండి. కరివేపాకులు బాగా వేగకపోతే పులుసు చేదుగా ఉంటుంది. ఇవి కాస్త క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి.
  • తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేయించిన వెల్లుల్లి, కరివేపాకుల మిశ్రమం, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
  • తర్వాత అదే పాన్​లో నూనె ఉంటే ఆ ఆయిల్లో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేపండి. ఆపై ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా మారే వరకు ఫ్రై చేయండి. అనంతరం టమాటా ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించండి.
  • ఇందులో కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి టమాటాలు గుజ్జుగా మారి ఆయిల్​ పైకి తేలె వరకు మగ్గించుకోండి.
  • తర్వాత చింతపండు రసం, కొన్ని నీళ్లు పోసి మిక్స్ చేయండి. పులుసు మరుగుతున్నప్పుడు కరివేపాకు మిశ్రమం, కొన్ని నీళ్లు పోసి కలపండి. ఇప్పుడు లో ఫ్లేమ్​లో పులుసుని బాగా మరిగించుకోండి.
  • ఆపై ఇంగువ, బెల్లం తురుము వేసి మిక్స్ చేయండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత పులుసులో ఉప్పు, కారం, అన్ని సరిపడా చెక్​ చేసుకుని స్టవ్​ ఆఫ్​ చేసుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన కరివేపాకు పులుసు రెడీ.
  • ఈ కరివేపాకు పులుసు నచ్చితే మీరు కూడా ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.

ఎన్ని వెరైటీలున్నా కరివేపాకు చికెన్ క్రేజ్ వేరే! - సింపుల్ టిప్స్​తో సూపర్ టేస్ట్

క్రేజీ​ "కొబ్బరి బొబ్బట్లు" - ఈ టిప్స్​తో చేశారంటే ఇంకొకటి కావాలంటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.