ETV Bharat / city

HIGH COURT : 'కేంద్రం నిధులిచ్చినా ఉపాధి బకాయిలు చెల్లించరా'

కేంద్రం వాటా పూర్తిగా చెల్లించినా ఉపాధి హామీ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం సొమ్మును దగ్గర పెట్టుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విచారణ పేరిట జాప్యం చేయడం సరికాదని హితవు పలుకుతూ...చెల్లింపులు చేయకపోవడానికి కారణాలు కోర్టుకు తెలపాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
author img

By

Published : Aug 18, 2021, 5:09 AM IST

Updated : Aug 18, 2021, 5:52 AM IST

కేంద్రం ఎప్పటికప్పుడు తన వాటా విడుదల చేస్తుంటే...ఉపాధిహామీ పనులు చేసిన గుత్తేదారులకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన వద్దే ఉంచుకోవడం ఏంటని ప్రశ్నించింది. ఆ సొమ్మును దేనికైనా మళ్లించారా అంటూ సూటిగా అడిగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల్లో అక్రమాలు జరిగాయని భావిస్తున్నారా అంటూ పంచాయతీరాజ్‌శాఖ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఉపాధిహామీ కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది.

ఇటీవల కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఉపాధిహామీ పనుల కోసం తమ వాటా కింద ఇవ్వాల్సిన 75శాతం సొమ్మును ఎప్పటికప్పుడు రాష్ట్రానిక చెల్లిస్తున్నామని తెలిపింది. తాము ఇచ్చిన సొమ్ములో ఇంకా ఖర్చు చేయని 1991 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉందని అఫిడవిట్‌లో పేర్కొంది. తాము ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్రం వాటా కింద 25 శాతం సొమ్ము కలిపి...ఉపాధి పనులు చేసిన గుత్తేదారులకు చెల్లించాల్సి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ధర్మాసనం...విజిలెన్స్ విచారణ పేరిట ఉపాధి పనులన్నింటికి బకాయిలు చెల్లించకపోవడం సరికాదని హితవు పలికింది. కేంద్రం నిధులు ఇచ్చామని చెబుతుంటే...మీరెందుకు చెల్లించడం లేదని నిలదీసింది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లలో ఎంతమందికి బకాయిలు చెల్లిచారో....ఇంకా చెల్లించకపోవడానికి కారణాలేంటో వాస్తవ పరిస్థితులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ...విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

ఇదీచదవండి.

TATA STEEL : విశాఖ ఉక్కుపై టాటా స్టీల్‌ ఆసక్తి

Last Updated : Aug 18, 2021, 5:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.