Happy Dussera: తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ - దసరా శుభాకాంక్షలు
తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో దసరా.. వెలుగులు నింపాలని కాంక్షించారు.

ప్రజల జీవితాల్లో దసరా వెలుగులు నింపి, ప్రతి ఒక్కరూ సకల సౌకర్యాలతో వర్థిల్లాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
"త్రిమూర్తులు, ఇంద్రార్ది దేవతలు సృష్టించిన శక్తిమాత దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు పోరాడి మహిపాషురుడి సంహారం చేస్తుంది. పదవ రోజును విజయానికి చిహ్నంగా విజయదశమిని జరుపుకునే ఈ పండుగ ప్రజలందరికీ దుర్గమ్మ ఆశీస్సులు అందాలి". చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా ఈ విజయదశమిని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకోవాలని చంద్రబాబు సూచించారు.
తెలుగు వారందరికీ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ శాంతి, సౌభ్రాతృత్వంతో కలిసి, మెలిసి ఉండాలంటే మనం మంచిగా ఉంటే సరిపోదు. చెడును ప్రతిఘటించి, పోరాడాలని సూచించారు.
తెలుగు ప్రజలకు నందమూరి బాలకృష్ణ.. విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కాంక్షించారు.
ఇదీ చదవండి: CM JAGAN WISHES: ప్రజలకు ముఖ్యమంత్రి జగన్.. దసరా శుభాకాంక్షలు