దాతలు దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు. లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న పేదలకు అన్నదానం చేసి మానవత్వం చాటారు.
గుంటూరు జిల్లాలో..
తాడికొండ మండలం నీడంముక్కల గ్రామంలో 500 మంది పేదలకు దాతలు నిత్యవసర సరకుల పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె భర్త కమ్మేళ శ్రీధర్ హాజరయ్యారు.
కృష్ణా జిల్లాలో..
విజయవాడకు చెందిన హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.. వారి నెల సంపాదనలో కొంత భాగం వెచ్చించి.. పెద్ద మనసుతో స్వయంగా వారి ఇళ్ల వద్ద ఆహారాన్ని వండుకొని విధుల్లో ఉన్న అనాథలు, వలస కూలీలకు ఆహారం పంపిణీ చేశారు.
60 రోజులుగా రాత్రి వేళ రోజుకు 300 మందికి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించారు. లాక్డౌన్ అయ్యేంత వరకు ప్రతిరోజూ ఇలా సాయం అందిస్తామని సంస్థ సభ్యులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: