ETV Bharat / city

తాతంటే ప్రాణం.. అందుకే ఆ మనుమరాళ్లు పాడె మోశారు..! - తెలంగాణ తాజా వార్తలు

సాధారణంగా ఎవరైనా చనిపోతే మగవారు మాత్రమే పాడే మోస్తారు. కానీ తాత మీద ఉన్న మమకారంతో అతని పాడెను... మనుమరాళ్లు మోశారు. ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.

తాతపాడె మోసిన మనుమరాళ్లు
తాతపాడె మోసిన మనుమరాళ్లు
author img

By

Published : Aug 29, 2021, 3:18 PM IST

తాతపాడె మోసిన మనుమరాళ్లు

చిన్నప్పుడు వేలు పట్టుకొని నడిపించిన తాతంటే వారికి ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆయన పక్కనే పడుకొని చందమాన కథలు విన్న ఆ మనుమరాళ్లకు.. ఆయన మరణం పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ఇన్నాళ్లు ఆయన కొడుకులు.. వాళ్ల పిల్లలే ఆయన భారాన్ని మోశారు.. ఆడపిల్లలమైన మేము కనీసం ఈ చివరి క్షణంలో.. పాడెనైనా మోస్తామంటూ ముందుకొచ్చారు. ఈ మనుమరాళ్లకు తాత మీదున్న ప్రేమను చూసిన బంధువులంతా.. అందుకు అంగీకరించారు.

తెలంగాణలోని నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పరడ గ్రామంలో దండంపల్లి అంజయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో అంజయ్య మనుమరాళ్లు, ఆయన సోదరుల మనుమరాళ్లే పాడె మోశారు. మొత్తం ఎనిమిది మంది కలిసి తాతను భారమైన హృదయంతో సాగనంపారు. పెద్దాయనపై తమకున్న ప్రేమను చాటుకున్నారు.

ఇదీ చూడండి:

'కృష్ణా జలాలపై జగన్, మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.