అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కిన సీఎం జగన్... నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో నగదు జమ చేశారు. దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ప్రభుత్వ ఉన్నతాధికారులు, అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజమ్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు చేసిన అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు సీఎం జగన్‌ను ఆశీర్వదించారు. 33,803 మంది అర్చకులు, 29,841 మంది పాస్టర్లు, 13,646 మంది ఇమామ్‌లు, మౌజమ్‌లకు రూ. 37.71 కోట్ల నగదు సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.