ETV Bharat / city

ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్​లో 55 పోస్టుల నియామకానికి అనుమతులు - ఆప్కోస్ తాజా వార్తలు

ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకానికి ప్రత్యేకంగా ఏపీ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్​ను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వీటి కార్యకలాపాల కోసం పోస్టులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

govt allocate staff to apcos
govt allocate staff to apcos
author img

By

Published : Jul 7, 2020, 4:50 AM IST

ఏపీ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్​లో వివిధ హోదాల్లోని 55 పోస్టుల నియామకానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కార్పొరేషన్​లో కార్యకలాపాల నిర్వహణ కోసం అధికారులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపింది. ఎండీ, ఈడీ, ఇద్దరు జనరల్ మేనేజర్లు, ఐదుగురు మేనేజర్లు, ఒక వ్యక్తి గత సహాయకుడు, ఐదుగురు సీనియర్ అకౌంటెంట్ల పోస్టుల భర్తీకి అనుమతులు వెలువడ్డాయి. 30 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 9 మంది ఆఫీస్ సబార్డినేటర్లు, వాచ్ మెన్ పోస్టులను నియమించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. పోస్టులను బట్టి డిప్యుటేషన్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాల్లో నియమించుకోవాలని అనుమతిచ్చింది.

ఇదీ చదవండి: ఇవాళ కడప జిల్లాకు ముఖ్యమంత్రి జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.