ETV Bharat / city

Book Festival: విజయవాడలో 32వ పుస్తక మహోత్సవం.. ప్రారంభించిన గవర్నర్ - విజయవాడ పుస్తక మహోత్సవం వార్తలు

Vijayawada Book Festival: విజయవాడ 32వ పుస్తక మహోత్సవాన్ని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. చిన్నారులకు పుస్తక పఠనం అలవరచటం తల్లిదండ్రుల బాధ్యత అని అన్నారు.

విజయవాడలో 32వ పుస్తక మహోత్సవం
విజయవాడలో 32వ పుస్తక మహోత్సవం
author img

By

Published : Jan 1, 2022, 9:39 PM IST

Vijayawada Book Festival: చిన్నారులకు పుస్తక పఠనం అలవరచటం తల్లిదండ్రుల బాధ్యత అని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. విజయవాడ 32వ పుస్తక మహోత్సవాన్ని గవర్నర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇతర భారతీయ భాషల నుంచి ఎంపిక చేసిన రచనలను తెలుగులోకి అనువదించడం ద్వారా తెలుగు పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలని ఆకాంక్షించారు. దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి, చరిత్రపై జ్ఞానం సుసంపన్నం అవుతుందని తెలిపారు.

'పుస్తకం హస్త భూషణం' అన్న ప్రసిద్ధ తెలుగు సామెతను ఉటంకించటం ఇక్కడ సముచితమన్న గవర్నర్.. తాను స్వయంగా పుస్తక ప్రియుడినని, ఒడియా భాషలో దేశభక్తి సాహిత్యాన్ని, విభిన్న రచనలను అందించానని గుర్తుచేసుకున్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ గత 18 సంవత్సరాలుగా మంచి గ్రంథాలయాన్ని నిర్వహించటమే కాక, మంచి పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రజలకు అందించటానికి కృషి చేయటం అభినందనీయమన్నారు.

గ్రంథాలయాలు మన విజ్ఞాన నిధి వంటివని, మన స్వాతంత్య్ర ఉద్యమానికి దృఢమైన మూలాలను అందించి, ఉద్యమం దేశవ్యాప్తం కావటానికి తోడ్పడ్డాయన్నారు. 'చదివే పిల్లవాడు ఆలోచించే పెద్దవాడు అవుతాడు.' అన్న సామెతను గుర్తెరిగి తల్లిదండ్రులు పుస్తక పఠనంపై పిల్లలకు ఆసక్తిని పెంచాలన్నారు. పుస్తక మహోత్సవ కార్యక్రమంలో.. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

Sajjala: 'ప్రభుత్వం మంచి చేస్తుంటే.. ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.