ETV Bharat / city

Govermer: రానున్న రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాలలో ఒకటిగా ఏపీ: గవర్నర్ - ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తాజా వార్తలు

పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దృఢమైన భౌతిక, సామాజిక, పారిశ్రామిక, మౌలిక సదుపాయాలతో రానున్న రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాలలో ఒకటిగా.. ఏపీ అవతరిస్తుందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. రాజ్​భవన్​లో పొట్టిశ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు.

governer bishwabushan harichandan says ap will be in top position in the country
రానున్న రోజుల్లో ఏపీ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుంది: గవర్నర్
author img

By

Published : Nov 1, 2021, 1:44 PM IST

దృఢమైన భౌతిక, సామాజిక, పారిశ్రామిక, మౌలిక సదుపాయాలతో రానున్న రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాలలో ఒకటిగా.. ఆంధ్రప్రదేశ్(andhra pradesh) అవతరిస్తుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(governer bishwabushan harichandan) అన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణంతో, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచిందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్(raj bhavan) దర్భార్ హాలులో ప్రత్యేక కార్యక్రమంలో.. అమరజీవి పొట్టి శ్రీరాములు(potti sriramulu) చిత్రపటానికి పూలమాల వేసి గవర్నర్ నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు చేసిన అత్యున్నత త్యాగం ఫలితంగా తెలుగు ప్రజల కోరిక సాకారమైందన్నారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన నాయకులకు, స్వాతంత్య్ర సమరయోధులను తెలుగు జాతి ఎన్నటికీ మరువదని అన్నారు.

కరోనా మహమ్మారి ఆర్థిక వృద్ధి, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ.. కష్టాల నుంచి కొత్త శిఖరాలను చేరుకోవాలనే ఉత్సాహం మనల్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపిస్తుందన్న అశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశంలో రెండవ పొడవైన తీర రేఖను కలిగి, ఎగుమతుల్లో 40శాతం వాటాతో అతిపెద్ద సముద్ర ఉత్పత్తి, ఎగుమతిదారుల్లో ఒకటిగా ఉండటం గర్వకారణమన్నారు. కొవిడ్ సృష్టించిన క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో కూడా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులలో, ఆదాయంలో.. రాష్ట్రం, దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కరోనా నుంచి రక్షణ పొందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, వాక్సిన్ తీసుకున్నప్పటికీ ఎలాంటి అశ్రద్ద ఉండకూడదని గవర్నర్ వివరించారు.

ఇదీ చదవండి:

FORMATION DAY WISHES : 'ఏపీ దేశానికి ఆదర్శంగా నిలిచింది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.