'ప్రభుత్వం దాడి చేసి.. ప్రతిపక్షాన్ని నిలదీయడమేంటి?' - విశాఖ శిరోముండనం న్యూస్
షెడ్యూల్ కులాలవారికి ఏం జరిగినా సంబధం లేనట్లుగా జగన్ ప్రభుత్వం ఉంటోందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు విమర్శించారు. ప్రభుత్వం ఎస్సీలపై దాడులు చేస్తుంటే, ప్రభుత్వంలోని వారు ప్రతిపక్షంపై నిందలేయడమేంటని ప్రశ్నించారు.
!['ప్రభుత్వం దాడి చేసి.. ప్రతిపక్షాన్ని నిలదీయడమేంటి?' gollapalli surya rao comments on jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8615837-357-8615837-1598785651905.jpg?imwidth=3840)
gollapalli surya rao comments on jagan
గత 15 నెలల్లో ఎస్సీలపై 375 దాడులు జరిగాయని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎస్సీలు నామినేషన్లు వేశారన్న అక్కసుతో దాదాపు 1000 తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం నడవకుండా, జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ వల్లే పదవులు వచ్చాయని ఎస్సీ ప్రజాప్రతినిధులు తెలుసుకోవాలని హితవు పలికారు.