గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా కేసులు తగ్గిన ప్రాంతాల్లోని 19 కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేసినట్లు బల్దియా వెల్లడించింది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని జోన్లు ఉన్నాయనే విషయాలను మాత్రం గోప్యంగా ఉంచింది.
జీహెచ్ఎంసీ కరోనా కంట్రోల్ రూంకు ఫోన్లు భారీ సంఖ్యలో వస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే 686 కాల్స్ రాగా... అందులో ఆహారం కోసం 545 మంది సంప్రదించారని.. వారికి ఆహారం అందించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీచూడండి: ఆన్‌లైన్‌లో ఇంటర్ పాఠాలు....జూన్ నుంచి అందుబాటులోకి..!