ETV Bharat / city

వేల్చేరు నారాయణ రావుకుమండలి బుద్ధప్రసాద్ అభినందనలు

author img

By

Published : Feb 27, 2021, 2:02 PM IST

ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ ఫెలోషిప్​కు ఎంపికైన వేల్చేరు నారాయణ రావును మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అభినందించారు. తెలుగు సాహిత్యంలో వేల్చేరు ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

Mandali Buddhaprasad
వేల్చేరు నారాయణ రావుకు అభినందనలు తెలిపిన మండలి బుద్ధప్రసాద్

ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ ఫెలోషిప్​కు ఎంపికైన వేల్చేరు నారాయణ రావును.. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అభినందించారు.

ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ ఫెలోషిప్ తొలిసారి సాహిత్యవేత్త ఆచార్య వేల్చేరు నారాయణ రావుకు లభించటం తెలుగుజాతికి గర్వదాయకం. ప్రపంచ సాహిత్య పటంలో తెలుగుకు స్థానం కల్పించటానికి వేల్చేరు చేసిన కృషి అద్వితీయం. ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యంలోని అద్భత రచనలను ఆంగ్లంలోకి అనువదించారు. 2019లో... మండల వెంకట కృష్ణారావు సాంస్కృతిక పురస్కారాన్ని.. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వేల్చేరుకు ప్రదానం చేసింది. గతంలో కృష్ణా జిల్లా, శ్రీకాకుళంలో శ్రీకృష్ణ దేవరాయ మహోత్సవాల్లో వారిని సన్మానించే అవకాశం నాకు లభించింది. వేల్చేరు నారాయణరావుకు నా హృదయపూర్వక అభినందనలు.

:- మండలి బుద్ధప్రసాద్, మాజీ ఉపసభాపతి

ఇదీ చదవండి:

అమరావతిలో వింతశబ్దంతో కంపించిన భూమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.