పాకిస్థాన్ జైలులో 14 నెలల పాటు నరకయాతన అనుభవించినట్లు అక్కడి నుంచి విడుదలైన రాష్ట్ర మత్స్యకారులు తెలిపారు. తిరిగి సొంత ప్రాంతాలకు వస్తామని అనుకోలేదని... జైలు నుంచి విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో జీవనోపాధిలేక పోవటం వల్లే పొట్ట చేతపట్టుకుని గుజరాత్ వెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలో తగిన జెట్టీలు, హార్బర్లు నిర్మిస్తే ఇక్కడే ఉండి కుటుంబాన్ని పోషించుకుంటామని...ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నరకయాతన నుంచి విముక్తి పొంది తమవారి వద్దకు వెళ్లడం తమకు చెప్పలేని సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల మరో ఇద్దరు మత్స్యకారులు విడుదల కావాల్సి ఉంది.
ఇవీ చూడండి: