Fire In Forest: కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం శివారులో అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గుడిమెట్ల గ్రామ శివారులో సుమారు 1000 ఎకరాల్లో అటవీ భూములు, కొండ అటవీ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెట్లు ఉన్నాయి. వీటిలో మంటలు చెలరేగడంతో అవి మొత్తం వ్యాపిస్తున్నాయి. ఫలితంగా చెట్లు తగలబడి పోతున్నాయి. అటవీ శాఖ అధికారులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు కనీసం ఫైరింజన్ సైతం అక్కడకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో గుడిమెట్ల గ్రామ ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : Building Balcony Collapse: కాకినాడలో కూలిన భవంతి పైకప్పు.. తప్పిన ప్రమాదం..