ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బందర్ రోడ్లోని చైతన్య కాలేజీ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. కళాశాల భవనం రెండో అంతస్తులోని స్టోర్ రూంలో ప్రమాదం జరిగిందని.. వస్తువులు కాలిపోయినట్లు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ప్రమాద సమయంలో భవనంలో 400 మంది విద్యార్థులున్నారని డీసీపీ విశాల్ గున్ని తెలిపారు. అప్రమత్తమైన సిబ్బంది.. విద్యార్థులను సకాలంలో బయటకు పంపడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. భవనం నుంచి దట్టమైన పొగలు రావడంతో బందర్ రోడులోని నగరవాసులు కొద్దిసేపు ఆందోళకు గురయ్యారు.
ఇదీ చదవండి: కళ్లముందే బిడ్డ మరణంతో... తల్లడిల్లిన గోమాత!