ETV Bharat / city

FM ON AP REVENUE DEFICIT: ఉచిత పథకాల వల్లనే ఏపీలో రెవెన్యూ లోటు అధికం: నిర్మలా సీతారామన్‌

FM ON AP REVENUE DEFICIT
FM ON AP REVENUE DEFICIT
author img

By

Published : Dec 14, 2021, 5:33 PM IST

Updated : Dec 15, 2021, 8:13 AM IST

17:29 December 14

NIRMALA SITHARAMAN ON AP FINANCIAL CONDITION

FM ON AP REVENUE DEFICIT: రాష్ట్రంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆదాయాన్ని వాస్తవికంగా అంచనా వేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైనట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. రెవెన్యూ వ్యయాన్ని నియంత్రించలేకపోవడంతో 14వ ఆర్థిక సంఘం కాలావధి మొత్తంతో పాటు, 15వ ఆర్థిక సంఘం పరిధిలోని 2020-21లో రెవెన్యూ లోటు గ్రాంటు మంజూరు చేసినా ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటులో పెరుగుదల కనిపించినట్లు ఆమె పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.

ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లేమి..

2015-16తో పోలిస్తే 2016-17లో రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణం ఉదయ్‌ స్కీం మార్గదర్శకాల ప్రకారం డిస్కంల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అందుకు ఖర్చు చేయడమేనన్నారు. 2019-20లో బడ్జెట్‌లో పేర్కొన్న రూ.1,779 కోట్లకు మించి రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, ఉచిత విద్యుత్తు లాంటి పథకాలేనని నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కూ వివిధ రూపాల్లో ఆర్థిక వనరులు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు గత ఎనిమిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల వాటా కింద మొత్తం రూ.4,40,985 కోట్ల ఆర్థిక వనరులు అందించినట్లు ఆర్థికమంత్రి వివరించారు.

.
.

ఇదీ చదవండి:

Old Age Pensions Hike in AP: జనవరి 1 నుంచి వృద్ధాప్య పింఛను పెంపు

Last Updated : Dec 15, 2021, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.