ఉత్తర్ ప్రదేశ్లో రైతులపై దాడిని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు విజయవాడలో రైతు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు మానవహారంతో(farmers union agitation at vijayawada against attack on farmers at uttarpradesh) నిరసన చేపట్టారు. రైతులపై దాడి అమానుషమని.. రైతులను చంపిన కేంద్రమంత్రి కుమారుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అన్నం పెట్టే రైతులపై దాడి అంటే.. దేశం సిగ్గుతో తలదించుకునే చర్య అని మండిపడ్డారు.
మోడీ ప్రభుత్వం నియంతృత్వ పాలనతో అరాచకాలు చేస్తోందని మండిపడ్డారు. కార్మికులు, కర్షకుల పొట్ట కొట్టి కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతున్నారని సంఘం నేతలు ఆరోపించారు. రైతు ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుంటూ.. వారిపైనే రాక్షసంగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ దారుణ ఘటనపై తెదేపా, వైకాపా, జనసేన స్పందించాలని.. ఫాసిస్టు పాలనకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి:
PERNI NANI ON MAA: 'మా' ఎన్నికల్లో ఏ వ్యక్తినీ, ఏ వర్గాన్నీ సమర్థించడం లేదు: పేర్ని నాని