ETV Bharat / city

death: బోర్లించి ఉన్న దేవుని పటాలు.. కూతురితో పాటు దంపతుల మృతదేహాలు.. అమీన్​పూర్​లో మిస్టరీ డెత్​ - తెలంగాణ క్రైమ్ వార్తలు

Family Commits Suicide: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ వందనపురి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఏడేళ్ల కుమార్తెతో పాటు దంపతులు బలవన్మరణం చేసుకున్నారు.

విషాదం
విషాదం
author img

By

Published : Jan 20, 2022, 4:36 PM IST

Updated : Jan 20, 2022, 5:38 PM IST

Family Commits Suicide: సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ వందన పురి కాలనీలో ఏడేళ్ల చిన్నారితో సహా దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. షాద్​నగర్​కు చెందిన శ్రీకాంత్ గౌడ్, అల్వాల్​లోని బ్రాహ్మణ కులానికి చెందిన అనామికలు గత పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి అనురాగానికి ఏడేళ్ల కూతురు స్నిగ్ధ కూడా ఉంది. శ్రీకాంత్ గౌడ్ టీసీఎస్​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తుండగా... అనామిక స్థానికంగా ఉన్న ప్రాచీన్ గ్లోబల్ కార్పొరేట్ పాఠశాలలో టీచర్​గా పనిచేస్తోంది. ముచ్చటైన సంసారం.. ఏమైందో తెలియదు గానీ రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి ఫోన్ చేసినా ఫోన్ లేపడం లేదు.

దీంతో అనుమానం వచ్చి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వందన పురి కాలనీలో ఉంటున్న శ్రీకాంత్ గౌడ్ నివాసానికి వచ్చి చూశాడు. తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంటనే పోలీసులు తలుపు తెరిచి చూసేసరికి అవాక్కయ్యారు. ఏడేళ్ల స్నిగ్ధ, ఆమె తల్లి అనామిక నురగలు కక్కుతూ విగతజీవిలుగా పడి ఉన్నారు. పక్క గదిలో బాలిక తండ్రి శ్రీకాంత్ గౌడ్ ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. వారి నుదుటిన ఎర్రటి బొట్లు ఉండడం, దేవుని గదిలో దేవుని చిత్రపటాలు బోర్లించి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అమీన్​పూర్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఓ కుటుంబం కనిపించడం లేదని సమాచారం రాగా.. వెంటనే అక్కడికి వెళ్లాం. ఆ ఇంటికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. అనుమానంతో తలుపులు తెరిచి చూడగా.. ఓ బెడ్​రూంలో శ్రీకాంత్​గౌడ్​ ఉరేసుకుని ఉన్నాడు. మరొక గదిలో చిన్నారి స్నిగ్ధతో పాటు ఆమె తల్లి చనిపోయి ఉన్నారు. వారిద్దరు విషం తీసుకుని చనిపోయినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -శ్రీనివాసులు రెడ్డి, అమీన్​పూర్​ సీఐ

అమీన్‌పూర్ పరిధిలోని వందనపురి కాలనీలో ఘటన

ఇదీ చూడండి: CM YS Jagan Review: రాష్ట్రంలోని 6 విమానాశ్రయాల విస్తరణ చేపట్టండి: సీఎం జగన్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 20, 2022, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.