ఉద్యోగ సంఘాలు ఒక రోజు జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించాయి. కొవిడ్–19 నివారణా చర్యలకు ఈ మెుత్తాన్ని అందించారు. క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి నేతలు లేఖలు సమర్పించారు. ఈ విరాళం రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. సీఎంను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి రమేష్, ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్.చంద్రశేఖర్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
ఇవీ చదవండి: