ఎల్లుండి మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మకు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని.. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆరోజున ఇంద్రకీలాద్రికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని భావించి అందుకు తగ్గట్టుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
దీనికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఆలయ ఈవో సురేష్ బాబు అధికారులు పాల్గొన్నారు. మూలా నక్షత్రం రోజున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. భక్తుల పెద్ద ఎత్తున వస్తారని భావించి అందుకు తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. భక్తులు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముందుగానే ఆన్ లైన్ లో టికెట్లు తీసుకుని దర్శనానికి రావాలని కోరారు.
ఇదీ చదవండి:
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్న.. పొలిట్ బ్యూరోలోకి బాలకృష్ణ