ఉద్యోగం కోసం 21 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నా.. తమ గోడు వినేవారే లేరని డీఎస్సీ-98 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 98 డీఎస్సీ లో సుమారు 4వేల 500 మంది అభ్యర్థులు అర్హత సాధించారని కొన్ని సాంకేతిక తప్పిదాల వలన తమకు ఇప్పటివరకు ఉద్యోగాలు రాలేదని బాధిత అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి... పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే డీఎస్సీ 98 క్వాలిఫైడ్ అభ్యర్థులకు తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం నివేదికనే పరిగణలోకి తీసుకొని... 36 మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారని చెప్పడం తమను తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి చూడండి-డీఎస్సీలో నష్టపోయిన వారికి న్యాయం చేస్తాం : మంత్రి సురేశ్