UNION BUDGET: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందించినట్లు కనిపిస్తోందని.. భారత పరిశ్రమల సమాఖ్య-ఏపీ చాప్టర్ అభిప్రాయపడింది. కరోనా ప్రభావం తగ్గుతున్న దశలో.. పర్యాటకం, ఆతిథ్యం, వైమానిక రంగాలకు ఊతమిచ్చినట్లుగా ఉందన్నారు. ఈ బడ్జెట్.. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నిలదొక్కుకునే అవకాశం కనిపిస్తోందన్నారు. భవన నిర్మాణ రంగాన్ని కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని.. క్రెడాయ్ విజయవాడ ప్రతినిధి ఆర్.వి. స్వామి అన్నారు. రాయితీల ప్రస్తావన లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్ ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా ఉందే తప్ప.. సామాన్యులకు ఉపయోగపడేదేమీ లేదని.. గుంటూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ మోహన్ అభిప్రాయపడ్డారు. ఏపీకి సంబంధించి ఎలాంటి హామీలూ లేకపోవటంపై నిరాశ వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఉద్యమ కార్యాచరణ యథాతథం: పీఆర్సీ సాధన సమితి