లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసులు ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నారని, కంటికి కనిపించని వైరస్‌తో పోరాటం చేస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఒకవైపు కరోనా వ్యాప్తి అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ప్రాణం పణంగా పెట్టి రాత్రింబవళ్లు పహారా కాస్తున్నారని వారి సేవలను కొనియాడారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా రాష్ట్రంలోకి వచ్చినప్పుడు వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నిబంధనల ప్రకారమే వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిని ప్రత్యేక యాప్‌తో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 20, 598 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లఘించిన 2,888 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు. నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు, వైద్యం లాంటి అత్యవసర సేవలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలను తెలుసుకుంటూ పోలీస్ సిబ్బందికి సూచనలిస్తున్నట్లు తెలిపారు. సమర్ధవంతంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామన్నారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన 2.41లక్షల వాహనాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 9,498 మందిపై కేసులు నమోదుచేశామన్నారు. నిబంధనలు అతిక్రమించి దుకాణాలు తెరిచిన 4,513 దుకాణాలను సీజ్ చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ లాక్‌డౌన్ సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు.
'ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు' - Dgp Letter On Police Service
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నారని... కంటికి కనిపించని వైరస్‌తో పోరాటం చేస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలను తెలుసుకుంటూ పోలీస్ సిబ్బందికి సూచనలిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. సమర్ధవంతంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామన్నారు.
!['ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు' పోలీసులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు: డీజీపీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6744813-438-6744813-1586550218502.jpg?imwidth=3840)