సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిల దుష్టచతుష్టయం రాష్ట్రాన్ని దోచుకుంటోందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. 175 సీట్లు గెలివాలనుకున్నప్పుడు ఎన్నికల ఖర్చు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికీ సంతలో పశువులను కొన్నట్లు నలుగురు ఎమ్మెల్యేలను కొన్నారని దుయ్యబట్టారు. ప్లీనరీకి తరలించిన ఆర్టీసీ బస్సులకు ఎంత డబ్బు చెల్లించారో బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
బడికివెళ్లే పిల్లల పుస్తకాలు, బ్యాగులపై ముఖ్యమంత్రి జగన్ పేరెందుకని దేవినేని నిలదీశారు. నాయకులు చేసే తప్పులకు సహకరిస్తే ప్రభుత్వ అధికారులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. 5 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం.., ఇప్పుడు అప్పు పుట్టని పరిస్థితిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి