ETV Bharat / city

'ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు వీఆర్వోలు అందుబాటులో ఉండట్లేదు' - జగన్​పై దేవినేని ఉమా కామెంట్స్

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు వీఆర్వోలను అందుబాటులో లేకుండా అధికార పార్టీ చేస్తోందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. నవరత్నాల్లో నవమోసాలు బయటపడ్డాయని విమర్శించారు.

క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు వీఆర్వోలు అందుబాటులో ఉండట్లేదు: దేవినేని

author img

By

Published : Jan 30, 2021, 3:01 PM IST

వైకాపా పాలేగాళ్లు గ్రామాలపై పడ్డారని దేవినేని ఉమా విమర్శించారు. బలవంతపు ఏకగ్రీవాలతో రెచ్చిపోతూ ప్రజల్ని భయపెడుతున్నారని ఆరోపించారు. ప్రామిసరీ నోట్ల మీద అగ్రిమెంట్లు రాసే కార్యక్రమం జరుగుతోందని దుయ్యబట్టారు. వీటన్నింటినీ అడ్డుకుని ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేయటంతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపాలన్నారు. వైకాపా నేతలు మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని దేవినేని ఆరోపించారు.

'ముఖ్యమంత్రి కనుసన్నల్లోనూ సజ్జల, మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు. రైతు భరోసా ఓ భోగస్ కార్యక్రమంగా మార్చేశారు. పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోళ్ల సమాచారం ఎందుకు తొలగించారు. గత 20నెలల్లో జలయజ్ఞానికి ఎంత ఖర్చు చేశారో జగన్ మీడియా ముందుకొచ్చి సమాధానం చెప్పాలి.' అని దేవినేని డిమాండ్ చేశారు.

ఆ నాలుగు గంటలు ఏం జరిగింది..?

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత 4 గంటల పాటు తాడేపల్లి ప్యాలెస్​లో ఏం జరిగిందని దేవినేని ఉమా నిలదీశారు. 'జగన్ గవర్నర్ వద్దకు వెళ్లి అసెంబ్లీ రద్దు చేయాలనుకున్నారు. ఆగ్రహంతో టీవీలు పగలకొడితే భద్రతా సిబ్బంది పక్కకు పారిపోయారు. ప్రశాంత్ కిషోర్ నివేదికతో పాటు ఇంటెలిజెన్స్ నివేదికలు చూసి రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఎందుకు భయపడ్డారు. జగన్​కు అంతా నచ్చచెప్పిననంతరం సాయంత్రం 6 గంటల తర్వాత సజ్జల మీడియా ముందుకొచ్చి పంచాయతీ ఎన్నికలపై మాట్లాడారు.' అని దేవినేని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ఏకగ్రీవాలపై షాడో బృందాలు దృష్టిపెడతాయి: ఎస్‌ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.