ప్రకాశం బ్యారేజీలో పూడిక తీసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజీ నుంచి ఎగువన 13 కిలోమీటర్ల వరకు పూడికతీత కోసం జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి. డీ-సిల్టింగ్ ప్రక్రియ ద్వారా బ్యారేజీ నుంచి 50 లక్షల టన్నుల పూడిక వస్తుందని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. పూడికతీత వ్యయాన్ని ఏపీఎండీసీ భరిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బ్యారేజీలో పూడికపై సర్వే, తవ్వకాలు, రవాణా తదితర అంశాలను ఏపీఎండీసీ చేపడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పూడికతీత కోసం వివిధ ప్యాకేజీల కింద రూ. 102 కోట్లు వెచ్చించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదీచదవండి
మేయర్లు, ఛైర్మన్ల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు.. పరిశీలనలో పలువురి పేర్లు!