ETV Bharat / city

Curfew: రాష్ట్రంలో ఈ నెల 30 వరకు కర్ఫ్యూ పొడిగింపు - ఆంధ్రప్రదేశ్ కర్ఫ్యూ వార్తలు

రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు సడలింపు
రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు సడలింపు
author img

By

Published : Jun 18, 2021, 12:44 PM IST

Updated : Jun 18, 2021, 1:28 PM IST

12:41 June 18

ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకూ సడలింపు

రాష్ట్రంలో ఈ నెల 30 వరకు కర్ఫ్యూ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 నుంచి ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. సాయంత్రం 6గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. 

తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈ వేళలు ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు అమలులో ఉంటాయి. సాయంత్రం 5 గంటలకల్లా దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం సాధారణ వేళల్లోనే పని చేస్తాయని, ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు వచ్చేలా మార్పులు  చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.  

ఇదీచదవండి.

kanakamedala: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగింపు తగదు: కనకమేడల

Last Updated : Jun 18, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.