రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 21 నుంచి 31 వ తేదీ వరకు కొవిడ్ నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు. అందులో భాగంగానే విజయవాడలో ఫ్రంట్ లైన్ వారియర్స్ తో అవగాహనా ర్యాలీ చేపట్టామన్నారు. కొవిడ్ పాజిటివ్ కేసు నమోదులో తారాస్థాయికి వెళ్లామని, ఇప్పుడు ఆ స్థాయి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టిందన్నారు.
మళ్లీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రత్తమంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. లాక్ డౌన్ నుంచి బయటపడి అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయని.. పాఠశాలలు కూడా ప్రారంభిస్తున్నామని వివరించారు. మాస్కే మన కవచం, మాస్క్ ధరించండి, మాకు సహకరించండి అని కలెక్టర్ ఇంతియాజ్ ప్రజల్ని కోరారు.
ఇదీ చదవండి: