తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ పట్టణాలలో ఆస్తిపన్నులో 50శాతం రాయితీ ఇవ్వాలని ఏపీ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సీహెచ్. బాబురావు డిమాండ్ చేశారు. పెనాల్టీలు రద్దు చేయాలనీ, ఇంటి పన్నులు పెంచే ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని అన్నారు.
కరోనా, ఆర్థిక మాంద్యం కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ ఇచ్చిందని బాబురావు అన్నారు. ఈ నిర్ణయం స్వాగతించదగ్గదన్నారు. ఏపీలోనూ ఇలాంటిది అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీలు ఇవ్వకపోగా పన్ను చెల్లింపులో జాప్యమనే పేరుతో 24శాతం పెనాల్టీ వసూలు చేయడం శోచనీయమన్నారు.
ఇవీ చదవండి..