సీఎస్ నీలం సాహ్నికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఏమాత్రం నైతిక విలువలున్నా తక్షణమే సీఎస్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుత స్థానంలో ఉండి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని రామకృష్ణ దుయ్యబట్టారు. ప్రపంచం మెుత్తం కరోనా వైరస్ ప్రభావంతో గడగడలాడుతుంటే...ఏపీలో మూడు వారాలపాటు ఉండదని ఎన్నికలు నిర్వహించాలంటూ లేఖ రాయడంలో సీఎస్ అంతర్యమేంటన్నారు. ఓటర్లకు కరోనా సోకి లక్షల మంది వ్యాధి బారినపడేవారని... అసలు ఎవరి సలహా ప్రకారం ఎన్నికల సంఘానికి లేఖ రాశారని రామకృష్ణ ప్రశ్నించారు.
ఇవీ చదవండి...జనతా కర్ఫ్యూ : రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కదలని జనత