ETV Bharat / city

'రాష్ట్రం కోసం ప్రధానితో ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలి'

ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రం గురించి ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనుల కోసం భేటీలో ఏం మాట్లాడారో వాటిని కచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు.

cpi ramakrishna
రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
author img

By

Published : Oct 7, 2020, 1:46 PM IST

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అంశాలను ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో మాట్లాడుతూ.. సీఎం తన వ్యక్తిగత విషయాలు చెప్పాల్సిన అవసరం లేదని.. అయితే రాష్ట్రానికి సంబంధించి ప్రధానితో ఏం మాట్లాడారో కచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

అవినీతిని నిరోధిస్తామని నెంబర్ ఇవ్వడం కాదని.. మంత్రి జయరాంపై వచ్చిన ఆరోపణలపై స్పందించి చర్యలు తీసుకోవాలని రామకృష్ణ అన్నారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అన్నట్లు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను బర్తరఫ్ చేస్తే సీఎం మంత్రివర్గంలో ఒక్క మంత్రి కూడా మిగలరన్నారు. పేద రైతుల వద్ద కొనుగోలు చేసిన భూములను తిరికి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జగన్​కు ఉంది. దిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. అది మంచి విషయమే. అయితే ఆయనతో రాష్ట్రం కోసం ఏం చర్చించారో.. దానికి ప్రధాని ఎలా స్పందించారో దాచాల్సిన అవసరం ఏముంది. ముఖ్యమంత్రి వ్యక్తిగత విషయాలు ఎవరూ అడగడం లేదు. కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర అభివృద్ధి కోసం భేటీలో ఏం మాట్లాడాలో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత సీఎంకు ఉంది. - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఇవీ చదవండి..

స్వలాభం కోసమే కేంద్ర పెద్దలతో రహస్య సమావేశాలు: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.