ETV Bharat / city

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: నారాయణ - సీపీఐ నారాయణ న్యూస్

కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని... ముఖ్యమంత్రి మెప్పు కోసమే హడావుడిగా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు అబాసుపాలు కావాల్సి వచ్చిందని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికలు నిలిపివేస్తూ..హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.

Cpi Narayana On parishad Election in ap
పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
author img

By

Published : Apr 6, 2021, 8:06 PM IST

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఎద్దేవా చేశారు. పరిషత్ ఎన్నికలు ఇప్పుడు నిర్వహిచటం కుదరదని మాజీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పేర్కొన్న విషయాన్ని అధికార పక్షం సానుకూలంగా స్వీకరించలేకపోయిందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు, సూచనలతో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు హడావుడిగా నిర్వహించడం సాధ్యం కాదని నిమ్మగడ్డ చెప్పిన విషయాన్ని నారాయణ గుర్తు చేశారు.

కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని... ముఖ్యమంత్రి మెప్పు కోసమే హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు అభాసుపాలు కావాల్సి వచ్చిందన్నారు. ఎస్​ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనే తాజాగా.. రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. ఎన్నికలు వాయిదా పడినందున పరిషత్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ పునరాలోచన చేయాలన్నారు.

ఇదీ చదవండి:

పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.