Nara Lokesh Tested Corona Positive: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొవిడ్ బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు ట్వీటర్ ద్వారా లోకేశ్ వెల్లడించారు. తనకు ఎలాంటి లక్షణాలూ లేవని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా తనని కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ క్షేమంగా ఉండాలని లోకేశ్ ట్విటర్లో పేర్కొన్నారు.
సీపీఐ రామకృష్ణకు కరోనా...
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు కరోనా నిర్ధరణ అయింది. స్వల్ప లక్షణాలతో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్సపొందుతున్నారు. ఇటీవల తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి :
Lokesh letter to cm jagan: ప్రాణాలతో చెలగాటమాడొద్దు.. విద్యాసంస్థల సెలవులు పొడిగించండి: నారా లోకేశ్