ETV Bharat / city

తెలంగాణ: పోలీసుశాఖపై కరోనా పంజా... సుల్తాన్ బజార్ ఏసీపీకి పాజిటివ్ - కరోనా తాజావార్తలు

కరోనా వైరస్​ పోలీసు శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా సుల్తాన్ బజార్ ఏసీపీకి వైరస్​ సోకింది. ఏసీపీతో పాటు డ్యూటీలో ఉన్న వారు, ఏసీపీ కుటుంబ సభ్యులంతా స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. వీరందరికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

corona-positive-to-sulthan-bazar-acp
corona-positive-to-sulthan-bazar-acp
author img

By

Published : Jul 5, 2020, 2:55 AM IST

హైదరాబాద్​లో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా పోలీసు శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యం విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు వైరస్ బెడద తప్పడం లేదు. తాజాగా సుల్తాన్ బజార్ ఏసీపీ కరోనా బారిన పడ్డారు. ఏసీపీ కుటుంబ సభ్యులకు, డ్యూటీలో ఉన్న వారికి వైరస్ సోకిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

రోజురోజుకూ పోలీస్​ శాఖలో వైరస్​ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. క్రాఫ్ట్ డేటాయిలింగ్ సర్వీస్ సహాయంతో వాహనాల్లో వైరస్ వ్యాపించకుండా శుద్ధి చేస్తున్నారు. నూతన టెక్నాలజీతో వివిధ రసాయనాలతో స్ప్రే చేస్తున్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు, భౌతిక దూరం పాటిస్తూ.. నిరంతరం చేతులు శుభ్రం చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: 200వ రోజు... ఉద్ధృతంగా అమరావతి రైతుల పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.