రాష్ట్రంలో కొత్తగా 2,997 కరోనా కేసులు, 21 మరణాలు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,07,023కు చేరింది. కొవిడ్‌తో ఇప్పటివరకు 6,587 మంది మృతి చెందారు. ప్రస్తుతం 30,860 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 7,69,576 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 67,419 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు మొత్తం 75.7 లక్షల మందికి టెస్టులు చేశారు.
కరోనా మృతులు
చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో ముగ్గురు.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖలో ఇద్దరు.. నెల్లూరు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున వైరస్ కారణంగా మృతిచెందారు.
జిల్లాల వారీగా కేసులు
పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 551 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి- 445, చిత్తూరు- 404, గుంటూరు-378, కృష్ణా-344, ప్రకాశం-266, విశాఖ-244, కడప-203, అనంతపురం-131, శ్రీకాకుళం-112, విజయనగరం-106, నెల్లూరు-98, కర్నూలు జిల్లాలో 60 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి..