తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దాదాపు పదిరోజుల తర్వాత రాష్ట్రంలో అత్యల్పంగా శనివారం ఏడు కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 990కి చేరింది. వీరిలో 307 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. మరో 25 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 658 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు శనివారం నమోదైన ఏడు కేసుల్లో ఆరు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కాగా.. ఒకటి వరంగల్ అర్బన్‌కు చెందినదిగా వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
వంద మంది చిన్నారులు..
అయితే ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఉన్న చిన్నారుల సంఖ్య సుమారు వంద వరకు ఉండటం గమనార్హం. పసి కందుల విషయంలో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా సోకిన పిల్లలను గాంధీలో ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఈ నెల 20 నుంచి నమోదైన కేసులను పరిశీలిస్తే..
తేదీ | కేసులు | డిశార్జ్ | మృతి |
20-04-2020 | 14 | 2 | |
21-04-2020 | 56 | 8 | 1 |
22-04-2020 | 15 | 1 | |
23-04-2020 | 27 | 58 | 1 |
24-04-2020 | 15 | ||
25-04-2020 | 7 | 16 |
ఈ నెల 22 నుంచి కేసుల్లో కొంత తగ్గుదల ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్లలో కొన్నింటిని వైద్య ప్రభుత్వం తొలగిస్తోంది. కేసులు కూడా త్వరలో మరింత తగ్గుతాయని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది.
రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు..
మరోవైపు రంజాన్ మాసం ప్రారంభమైన తరుణంలో చికిత్స పొందుతున్న ముస్లింలకు ప్రత్యేక ఆహారం ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని వైద్యులకు మంత్రి ఈటల ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వారి ఆహారంలో పండ్లు, డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఇఫ్తార్‌లో ఉండే ఆహారాన్ని అందించాలన్నారు.
ఇవీ చూడండి: