రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 93,785 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 2,526 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు 24 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 2,933 మంది బాధితులు కోలుకున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 25,526 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ ప్రభావంతో... ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో 404, చిత్తూరు జిల్లాలో 391, ప్రకాశం జిల్లాలో 308, కృష్ణా జిల్లాలో 269 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:
Bjp Mahila Morcha: 'ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు.. కాగితాలకే పరిమితం'