జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైనా… ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని కాంగ్రెస్ కిసాన్ సెల్ ఛైర్మన్ జెట్టి గుర్నాధరావు ఆరోపించార. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో గుర్నాధరావు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిపెస్టోలో రూ.12,500 రైతు భరోసా కింద ఇస్తానని చెప్పి… రూ.7500 ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మిటర్లను బిగిస్తామని తెలిపిన ప్రభుత్వం... రైతు వ్యతిరేక విధానాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. మీటర్ల ద్వారా రైతులు నష్టపోతారని, రైతులను నాశనం చేసే విధంగా కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు.
ఇదీ చదవండీ… మరో 10,199 పాజిటివ్ కేసులు.. కోలుకున్న 9,499 మంది