Conflict between Telugu states fishermen: తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని కృష్ణా నది పరిధి నాగార్జునసాగర్ వద్ద తెలుగురాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతంలో తెలంగాణ, ఏపీ మత్స్యకారులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఏపీ మత్స్యకారులు మొండిగా రింగ్ వలలు వేస్తున్నారంటూ.. తెలంగాణలోని నల్గొండ జిల్లా మత్స్యకారులు ఆరోపించారు. సమాచారం అందుకున్న రాష్ట్ర పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని, తెలంగాణ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: